![]() |
![]() |
సుమ అడ్డా షో శివరాత్రి స్పెషల్ గా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ ఎపిసోడ్‌కి బిగ్‌బాస్ ఫేమ్ శ్వేత వర్మ, మహేష్ విట్టా, నటరాజ్ మాష్టర్ , ఆర్జే కాజల్ గెస్టులుగా వచ్చారు. ఇక నటరాజ్ మాష్టర్ తో మేకులు గుచ్చిన అట్ట మీద డ్యాన్స్ చేయించడానికి చూసింది ఆర్జే కాజల్. కానీ నటరాజ్ మాష్టర్ భయపడ్డాడు. ఆ మీ ఆయన్ని ఎప్పుడైనా "ఏవండి" అని పిలిచారా అని అడిగాడు నటరాజ్ మాష్టర్ . లేదు పిలవలేదు అంటూ వెంటనే లైవ్‌లోనే రాజీవ్ కనకాలకి కాల్ చేసి "నేను నిన్ను కొత్తగా ఒకటి పిలవాలనుకుంటున్నా..ఏవండీ" అని పిలిచేసరికి రాజీవ్ కనకాల ఫుల్ ఖుషీ ఐపోయాడు. ఆ తర్వాత ఆర్జే కాజల్ ఫామిలీ పిక్ చూపించారు. అది చూసి కన్నీళ్లు పెట్టుకుంది కాజల్."చిన్నప్పుడు పిల్లలు ఎలా అయితే ఉంటారో వాళ్లు టీనేజ్‌లోకి వెళ్ళాక అలా ఉండరు.. .ఆ మార్పుని నేను జీర్ణించుకోలేకపోతున్నా.. ఇప్పుడు తన రూమ్‌లో తనే ఉంటుంది.. .బయటికి ఎక్కువ రావట్లేదు.. ఎక్కువగా మాట్లాడట్లేదు.." అంటూ తన కూతురి గురించి చెప్పి బాగా ఎమోషనల్ ఐపోయింది. తర్వాత శ్వేతా వర్మ చిన్నతనంలో తన తల్లితో ఉన్న ఓల్డ్ పిక్ ని చూపించారు. దాంతో శ్వేతా కూడా బాగా ఎమోషనల్ అయ్యింది. " నేను మా అమ్మ ఎక్కడికి వెళ్లినా కుక్క పిల్లలా ఫాలో అయ్యేదాన్ని. ఇప్పుడు ఆమెని చాలా మిస్ అవుతున్నాను. చిన్నప్పుడు మా చుట్టాల్లో ఒకరు మా సిస్టర్ తో మిస్ బిహేవ్ చేశారు. అది తెలిసిన మా అమ్మ కెరీర్ ని వదిలేసి ఇంటిదగ్గరే ఉండిపోయింది. తనకి హెల్త్ బాగోలేకపోయినా మా కోసం అన్నీ వదిలేసుకుంది" అంటూ కన్నీళ్లు పెట్టేసరికి సుమ కూడా ఎమోషనల్ అయ్యింది.
![]() |
![]() |